ఫేస్-బుక్ లో చాల మంది అబ్బాయిలు కాని అమ్మాయిలు కానీ
ఎలా ఉంటున్నారంటే..!!
ఫ్రెండ్స్ 400+ ఉంటారు.
ఆల్రడీ అంతమందిలో కొంతమందితో
చాటింగులు చేసి బోర్ కొట్టేసి
ఇంకా ఎవరు తగులుతారా.! అని చూస్తుంటారు..
వీరికి బయట ఒక లవర్ ఉంటుంది/ఉంటాడు.
ఎవరైనా లవర్ ఉన్నాడా అని అదిగితే,
నొ నో నాకసలు లవ్ అంటేనే ఇష్టం ఉండదు అంటారు.
అదే అబ్బాయిలైతే ఇక ఈ మాట వినగానే తగులుకుంటారు...
ఆ అమ్మాయికి కూడా తెలుసు వీడు ట్రై చేస్తున్నాడని...
ప్రేమించటానికి కాదు, పడేయటానికి...
అయినా కంటిన్యూ చేస్తారు...
అబ్బాయిలకి ఒక డౌటు ఉంటదనమాట
ఇది నాతోనేనా..!! ఇంకా ఎవరితో అయినా మట్లాదుతోందా..!!? అని
ఆ అమ్మాయి ఆల్టర్నేటివ్ ఎవరో ఒకడిని ఉంచిందేమో అని
ఆ అమ్మాయి ఎమన్నా తక్కువదా..!?
వీడు ప్రపోస్ చేసేంత వరకు చూస్తుంది...
హ్హ... ఒక్కసారి ప్రపోస్ చేసాక అంతే..
ముందే చెప్పానుగా నాకిలాంటివన్నీ నచ్చవనీ..
అని ఓ తిప్పేసుకుంటూ వీడి చేత బ్రతిమలాడించుకుంటారు.
ఒకవేళ వీడు ఆగిపోయాడనుకోండి...
ఛీ వీడికి లవ్ సెన్స్ లేదు అని వదిలేస్తారు వాడిని.
వీడు నిజంగా అల బ్రతిమలాడే తైపు కాదండొయ్...
కాకాపోతే అమ్మాయిని పూర్తిగా పడేయాలిగా..
అందుకని వీడు బ్రతిమలాడుతున్నట్లు నటిస్తుంటాడు...
అమ్మాయి వీడికి ఓ.కే. చెప్పదు కానీ
వీడు నిజంగానే లవ్ చేస్తున్నాడే..!! అని ఫీల్ అవుతుంటారు..
అమ్మాయిలు ఓ.కే. చెప్పకపోవటానికి కారణం ఎంటంటే,
గబుక్కున వీడికి కమిట్ అయ్యాక ఇంకా మంచి వాడొస్తే..!!
అమ్మో అప్పుడు షిఫ్ట్ అవడం కష్టం అవుథుందేమో...అని.
మనవాడు ఇంకా తెలివికల వాడు.
ఒకపక్క ఈ అమ్మాయిని బ్రతిమలాడుతుంటాడు.
ఇంకోపక్క ఈ లవ్ ని ఫెయిల్ చేసి
లవ్ ఫెయిల్యూర్ స్టొరీ చెప్పి ఇంకో అమ్మాయిని పడేయటానికి ట్రై చేస్తుంటాడు...
ఒకవేళ ఇప్పుడున్న అమ్మాయి పెళ్ళి చేస్కుందాం అంటే ఒప్పుకోలేదనుకో.
ఓ నాలుగైదు సార్లు బ్రతిమలాడి,
నాకు నీతో గ్నాపకాలు కావాలి కనీసం అంటాడు.
ఆ మాటకి ఎలాగో పడిపోతుంది. కానీ కమిట్ అవదండొయ్..
వాడు ఎంజాయ్ చేయటానికి ఫిక్స్ అవుతాడు...
ఏదోక రొమాంటిక్ టైము చూస్కోని,
ఓ మంచి ఫ్రెంచ్ కిస్ ఇవడానికి ట్రై చేస్తాడు.
అది వర్కౌట్ ఐందనుకోండి.. ఇంకేముంది ముందుకెల్తాడు...
అదే కాలేదనుకోండి..
ఓ సారీ చెప్పి "దీంతో వేష్ట్ రా బాబు" అనుకుని వెళ్ళిపోతాడు.
ఇంత జరిగాక కూడా అమ్మాయి
వీడు వెంట పడాలి అనే అనుకుంటుంది...
అమ్మాయిలు ఇలా అనుకుంటారని వీడికి తెలుసు కాబట్టి
వీడు వెంట పడుతున్నట్టు నటిస్తూ...
ఇంకో పిట్టకి వల వేస్తుంటాడు.
ఆ అమ్మాయి కూడా ఇంకెవడైనా ఇంతకంటే బెటర్ వాడు
దొరుకుతాడేమో అని వెతుకుతుంటుంది...
ఎవడైనా దొరికితే ట్రై చేస్తుంది. బాగోపోతే వదిలేస్తుంది.
హ్హ... ఇది నెవరెండింగ్ ప్రోసెస్...
ఫైనల్ గా ఇక్కడ ఏం కావాలంటే.
అమ్మాయికి వెంటపడటానికి ఒకడు,
ఎంజాయ్ చేయటానికి ఒకడు,
రేంజ్ చూపించుకోటానికి ఒకడు కావాలి.
వీటికి వాడు ఎలాంటి వాడైనా పర్లేదండోయ్...
కానీ పెళ్ళి చేస్కునే వాడు ఈ మూడిటితో రావాలి.
వేరే అమ్మాయిల గురించి ఆలోచించకూడదు.
ఇక అబ్బాయిలకి ఎంజాయ్ చేయటానికి,
ఫ్రెండ్స్ ముందు గొప్పగా చెప్పుకోటానికి,
అన్నీ లైట్ తీస్కునే అమ్మాయి కావాలి.
కానీ పెళ్ళికి మాత్రం పైవేవీ చెయ్యని అమ్మాయి కావాలి.
ప్రియమైన స్నేహితులారా..!!
ఈ ప్రోసెస్ లో గాయపడేది కేవలం కొన్ని మనసులు కాదు
బోలెడు నమ్మకాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు...
ఈ రోజు చేసే ఈ చిన్న చిన్న తప్పులని లైట్ ఇవన్నీ కామన్
అని సర్ది చెప్పుకోని మిమ్మల్ని మీరు మోసం చేస్కోకండి.
రేపెప్పుడైనా మీ పిల్లలు మీ ముందే ఇలా చేస్తుంటే...
మీరు ఇది తప్పురా అని చెప్పటానికి కూడా సిగ్గు పడెలా ఉండకండి.
గమనిక: ఈ టపాలో నేను అబ్బాయిలని కానీ, అమ్మాయిలని కానీ కించ పరచాలని రాయలేదు. కేవలం సమాజం లో జరుగుతున్న తప్పుని చెప్పానంతే. అందరూ ఇలానే ఉంటారని నేననట్లేదు. మంచి వాళ్ళు చలా మంది ఉన్నారు. ఇది ఈ మార్గం లో చెడిపోతున్న యువతరానికి. దయచేసి తప్పుగా భావించకండి. ఎందుకంటే ఇది నిజం, నిజాలు ఇలానే ఉంటాయ్. నిజం నిప్పులాంటిది (కాల్తుంది).