అమ్మాయిలు మోసపోవటానికి కారణం అమ్మాయిలే...

ప్రతి సారీ అమ్మాయిల్ని మోసం చె్స్తున్నారు మోసం చేస్తున్నారు అని ఊరికె అరవటం మానేసి అసలు ఎందుకలా జరుగుతోంది అని ఎప్పుడైనా ఆలోచించారా...!!!
లేదు.
ఎప్పుడు చూడు సమస్య వచింది సమస్య వచింది అని
వచ్చిన తర్వాత ఎడవటమేనా..!!??

ఇక్కడ నేను అమ్మాయిలని కించ పరచటం లేదు.
నిజం మాట్లాడుతున్నాను.
అమ్మాయిలకి ఒక అబ్బాయిని ప్రేమించే ముందు అసలు అది ప్రేమేనా అని ఆలొచించనవసరం లేదా.
యవ్వన దశలో హార్మోనుల మార్పు వలన ప్రతి వ్యక్తి ఆకర్షింపబడటం అందరి విషయం లో సర్వ సాధారణం.
ఆ విషయం తెలిసి కుడా ఆ వయసు లో ఆకర్షణకి గురయ్యి కొంత కాలం తర్వాత విడిపోయి, వాడు మోసం చేసాడు, వీడు మోసం చేసాడు అనుకుని ఏడవటం ఏంటసలు???

ఈ ప్రపంచం లో ప్రతి 1000 మంది అబ్బాయిలలో నిజాయితీ గా ప్రేమిస్తున్నది ఒక్కడు మాత్రమే...
ముందు వాడి గురించి తెలుసుకోవాలి.
ఈ మాట చెప్పగానే " నువ్వు ఎలాంటి వాడివి ? " అని వాడినే అడిగితే
వాడు ఖచితంగా అబద్దమే చెప్తాడు.
వాడు నిజం చెప్తున్నాడా అబద్దం చెప్తు్న్నాడా అనేది మీరు డిసైడ్ చేస్కోవాలి.

ప్రతి ఒక్కడు టీనేజ్ లో ఉన్నప్పుడు
ఏ అమ్మాయి దొరుకుతుందా , ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అనే ఆలోచిస్తాడు.
ఎవరైన కాస్త అందంగా కనిపించగానే,
ఫినిష్ , ఇక ఆ అమ్మాయిని పడేయటం మొదలు పెడతాడు.
ఇక్కడ అమ్మాయిలకి తెలియని నిజం ఒకటుంది.
అదేంటంటే

టీనేజ్ లో అబ్బాయిలు కోరుకునేది ప్రేమ కాదు.
సెక్స్  కోరుకుంటారు...
ఒకవేళ ఎవరైనా దొరికి వాళ్ళతో ఎంజాయ్ చేసినా, తిరిగినా
నాకేముంది నష్టం నేను మగాణ్ణి అనే ఒక అహం ఉంటుంది.
ఈ వయసు కుర్రాళ్ళు
అమ్మాయిల్ని ప్రేమించటం మర్చిపోయి కేవలం వాళ్ళతో గడపటం గురించే ఆలోచిస్తారు.

ఒక్కసారి ఆలోచించండి.
ఎవడైనా సరే ఒక అమ్మాయి సంసారానికి పనికిరాదు అని తెలిస్తే ప్రేమిస్తాడా...!!???
అస్సలు ఇస్టపడడు. ఆ అమ్మాయి ఎంత గొప్ప అందగత్తె అయినా సరే...
ఎందుకో తెలుసా..?? ఎందుకంటే ఎవడైనా ఒక అమ్మాయి విషయమ్లో
సెక్స్ గురించే ఆలోచిస్తాడు.
కాదు నేను చెప్పేది తప్పంటారా...!!!
మీకు మీరే టెస్ట్ చేస్కోంది తెలుస్తుంది.

లేదు తను నాకు మాట ఇచ్చాడు, విడిపోనని చెప్పాడు అని అంటారా...
అందరూ అలాగే చెప్తారు.
కావాలంటే మీరే తెలుసుకోండి.
ఒక్కసారి మీ బాయ్ ఫ్రెండ్ కి
" నాకు పిల్లలు పుట్టరట, మొన్న డాక్టర్ చెప్పింది. " అని చెప్పి చుడండి.
నెల రోజులలో మీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమో కాదో...

పైన చెప్పాను చూసారా...
1000 మంది ఉంటే అందులో
సుమారు 600 మంది వాడుకుని వదిలేసే వాళ్ళే...
మిగిలిన వారిలో 300 మంది కమిట్మెంట్ తో ప్రేమించే వాళ్ళైతే
99 మంది ఎలాంటి ఫీల్ లేక దొరికిన వారితో త్రుప్తి పడేవాళ్ళు.
ఇక మిగిలిన ఒక్కడు నిజాయితీగా ప్రేమించే వాడుంటాడు.

మీరు గురయ్యే ్కంఫ్యూజను వల్ల మీరొక్కరే కాదు, మిమ్మల్ని ్నిజంగా ప్రేమించే వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు. అలా మీరెప్పుడైనా ఆలోచించారా...???
ఇప్పటికైనా మేలుకోండి.
మీరు ప్రేమలో లేరు కెవలం ఆకర్షణ మాత్రమే అని తెలుసుకోండి.

నేను అమ్మాయిలకి వ్యతిరేకం కాదు.
అలా అని అబ్బాయిలని కూడా అనట్లేదు.
ఈ సమాజం లో ఒకరి వల్ల ఒకరు ఇద్దరూ బాధపడుతున్నరు.
ఈ ప్రేమ విషయాలలో అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను.

మరొక్క విషయం
అమ్మాయిలూ, మీ కంఫ్యూజను తో ఒక అబ్బాయికి ఆశలు రేపితే
తర్వాత జరిగే పరిణామాలకి మీరే భాద్యులు అవుతారు.
అలా చేస్తే నిజాయితీ గ ప్రేమించే వాడు కూడా
అసలు ప్రేమ లేదు తొక్క లేదు అంతా ట్రాష్ అనే అనుకుంటాడు.
ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచం లో నిజమైన ప్రేమ చచ్చిపోతుంది.

ప్రేమించే ముందు
వాడు షో చేస్తున్నాడా, నిజంగానే మంచివాడా అని తెలుసుకోండి.
మీరు షో కి అట్రాక్ట్ అయినట్లైతే, జాగ్రత్త పడండి.
అందరూ మంచివాళ్ళూ ఉండరు, అందరూ చెడ్డవాళ్ళూ ఉండరు.
మగాళ్ళు ఉంటారు అంతె.
ఒక అమ్మాయి విషయం లో మగాడిగా ఆలోచించే వాడు కావాలో
ఒక మనిషిగా ఆలోచించి నిజాయితీ గా ప్రేమించే వాడు కావాలో మీరే తేల్చుకోండి.

గమనిక : ఈ బ్లాగు లో నేను కాస్త ఓపెనుగా మాట్లాడుతున్నాను. తప్పుగా అనుకోకండి. నిజాలు ఇలాగే ఉంటాయి. అయినా సరే ఇది మీకు తప్పు అనిపిస్తే నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను.

మీ
చిన్నా ( జి.వి.ఆర్ )
-----------------------------------------------------------------------------------
నేను ఇక్కడ అమ్మాయిలకి మాత్రమే చెప్తున్నా అనుకోకండి.
ఇంతకు ముందు అబ్బాయిలకి రెండు బ్లాగులలో చెప్పాను...
ఇప్పుడు మీకు ఇందులో చెప్తున్నాను అంతే...
ఇక్కడ ఎవరికి పక్షపాత వైఖరి చూపటం లేదు.
అర్దం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను....